తాను చనిపోతూ ఇద్దరిని కాపాడిన రేవతి
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లి, అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి వెనుక విషాద గాథ దాగుంది. గతేడాది తన భర్త భాస్కర్ ఆనారోగ్యం పాలైతే అమె తన లివర్ ను కొంత భాగం తన భర్తకు దానం చేసి ఆయన ప్రాణాలు కాపాడింది. అదే విధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తన కుమారుడు శ్రీ తేజ్ ను తన పొత్తిళ్లలో ఉంచుకుని రక్షించారు. అయితే చివరకు తన ప్రాణాలే కోల్పోయింది. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతమయ్యారు.