సంక్రాంతికి 10 కాదు 3 రోజులే సెలవులు: ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులను తగ్గించింది. మార్చి నెలలో పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో, సాధారణంగా ఇచ్చే 10 రోజుల సెలవుల్ని కేవలం 3 రోజులకే పరిమితం చేసింది.
జనవరి 13, 14, 15 తేదీల్లో మాత్రమే విద్యార్థులకు సెలవులు ఉంటాయి. మిగిలని రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించనున్నారు. మార్చి 17 నుండి 31 వరకూ రోజు విడిచి రోజు పరీక్షలు ఉంటాయి. దీంతో విద్యార్థులు పరీక్షకు ముందు రోజు ఒక రోజు ఉండటం వలన పరీక్షలో మంచి ప్రదర్శన కనబరుస్తారని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ షెడ్యూల్ ద్వారా విద్యార్థులు పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు మంచి సమయం లభిస్తుంది.
అయితే, సంక్రాతి పండుగ దృష్ట్యా విద్యార్థులకు సెలవులు తగ్గించడంపై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.