ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై కేసు నమోదు
గిరిజనుడు దుర్గప్ప ఫిర్యాదుతో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ తో పాటు 17 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. గోపాలకృష్ణన్‌తో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో, మరో 16 మందిపై బెంగళూరులో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
2014లో వీరంతా ఓ హనీ ట్రాప్ కేసులో తప్పుగా ఇరికించారని, అంతేకాకుండా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫ్యాకల్టీ విధుల నుంచి తనను తొలగించారంటూ మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు. కులం పేరుతో తనను దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.