స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణలో SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్ కు మే 31 వరకు గడువు ఇచ్చారు.