చంద్రబాబు ప్రాణాలకు మావోయిస్టుల ముప్పు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు భద్రత పెంచారు. ఈ మేరకు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాన్ని జత చేశారు.
ప్రస్తుతం సీఎంకు NSG, SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. SPG ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ బృందానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.