వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!
వైసీపీ సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసిపి రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నంకు చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపినట్టు తెలిపారు.
త్వరలోనే ఆయన ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పార్టీలలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపైన ఆయన స్పష్టత నివ్వలేదు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన సీనియర్ నేత అయిన చొక్కాకుల వెంకటరావు ప్రస్తుతం పార్టీని వీడటంతో విశాఖలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింగి. చొక్కాకుల వెంకటరావు వైసిపి స్థాపించిన వెంటనే పార్టీలో చేరారు.
ఆయన 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన చొక్కాకుల ఓటమిపాలయ్యారు. అప్పుడు బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం బిజెపిలో చేరారు.