రోజుకు 5 వేలు ఇస్తేనే కాపురం అంటున్న భార్య.. పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి
భర్తల పట్ల భార్యల ప్రవర్తన రోజు రోజుకూ విచిత్రంగా తయారవుతోంది. రోజూ రూ.5 వేలు ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోందని బెంగళూరు సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించాడు. వర్క్ ఫ్రం హోం సమయంలో జూమ్ కాల్స్ లో మాట్లాడేటప్పుడు భార్య కొట్టేదని, ల్యాప్టాప్ ముందు డాన్స్ కూడా చేయడంతో జాబ్ పోయిందని తన ఆవేదన వ్యక్తం చేశాడు. 60 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు వద్దంటోందని తన గోడు వెళ్లబోసుకున్నాడు. విడాకులు అడిగితే రూ.45 లక్షలు డిమాండ్ చేస్తోందనని తెలిపాడు. అయితే మరో పెళ్లి కోసమే భర్త ఇలా ఆరోపిస్తున్నాడని ఆ ఉద్యోగి భార్య చెబుతోంది.