బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. సిట్ ఏర్పాటు
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్ ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్ ను నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే.