బన్నీకి గుడ్ న్యూస్: అల్లు అర్జున్ పై కేసు వెనక్కి... రేవతి భర్త
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన బాధితుడు, రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీ తేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వైద్యానికి స్పందిస్తున్నాడు, కళ్లు తెరిచి చూస్తున్నాడని అన్నారు. నా వలన అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం ఇష్టం లేదని.. అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు వాపసు తీసుకుంటానని భాస్కర్ అన్నాడు.
తెలంగాణ ప్రభుత్వం నుండి కోమటి రెడ్డి గారు హామీ ఇచ్చారని, అల్లు అర్జున్ 25 లక్షలు ప్రకటించారని.. ఇప్పటి వరకూ 10 లక్షలు ఇచ్చారని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా 50 లక్షలు ఇచ్చారని అదే విధంగా డైరక్టర్ సుకుమార్ ఫ్యామిలీ కూడా అండగా ఉందని చెప్పుకొచ్చారు.