గంజాయితో పట్టుబడ్డ స్టార్ క్రికెటర్
కెనడా జట్టు స్టార్ క్రికెటర్, కెప్టెన్ నికోలస్ కిర్టన్ గంజాయితో పట్టుబడి అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. బార్బడోస్ లోని గ్రాంట్లీ ఆడమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిర్టన్ ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన వద్ద 9 కిలోల గంజాయి దొరికిందని జమైకా గ్లీనర్ తన కథనంలో వెల్లడించింది. కెనడాలో 57 గ్రాముల వరకు గంజాయి కలిగి ఉండవచ్చు. ఆ పైన గంజాయిని కలిగి ఉండడం నేరం కిందకు వస్తుంది. కిర్టన్ అనుమతికి మించి 160 రెట్లు ఎక్కువ గంజాయిని తీసుకెళ్లడంతో అతడిని అరెస్ట్ చేశారు.