తుఫాన్ భీభత్సం.. 17 మంది మృతి

News Published On : Tuesday, April 8, 2025 12:00 PM

అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాల్లో తుపానులు బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా 17 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. కెంటకీ, టెనెస్సీ, అలబామా ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్షపాతం, ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. టెనెస్సీ రాష్ట్రంలో తుపాను అతలాకుతలం చేసింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 10 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.