నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్

News Published On : Friday, January 24, 2025 08:39 PM

కాలేజి భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. అయితే విద్యార్థి చరణ్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.