HCU భూములపై సుప్రీం కోర్టు సంచలన ఉత్తర్వులు
HCU కంచ భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరికివేయొద్దని, భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సీరియస్ విషయమని, చట్టాన్ని మీరు ఎలా చేతుల్లోకి తీసుకుంటారని సీఎస్పై ఆగ్రహం చేస్తూ ప్రతివాదిగా చేర్చింది.