ప్రభుత్వంపై సుప్రీం కోర్టు సీరియస్
కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతను ప్రభుత్వం సమర్ధించుకోవద్దని, చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సుప్రీం పేర్కొంది. సీఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంది. కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేసామని, ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృత్తం కానివ్వమని ప్రభుత్వ లాయర్ తెలిపారు.