TCS ఉద్యోగుల హైక్ ఆలస్యం..!
ఈ ఏడాది ఉద్యోగుల జీతాల పెంపు ఆలస్యం అవ్వొచ్చని TCS హింట్ ఇచ్చింది. 'పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. జీతాల పెంపుపై ఈ ఏడాదిలో నిర్ణయం తీసుకుంటాం. వ్యాపారాన్ని బట్టి అది ఎప్పుడైనా ఉండొచ్చు' అని చీఫ్ HR మిలింద్ తెలిపారు. 2025 JAN-MARలో TCS కేవలం 625 మంది ఉద్యోగులను మాత్రమే చేర్చుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలోనూ ఫ్రెషర్ల నియామకాలు అంతే లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చని చెప్పారు.