Breaking: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం
ఏపీలో పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మరో ఫలితం వెలువడింది. ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 50 శాతానికిపైగా ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకున్నారు.
ఏడు రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావుపై ఆలపాటి రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి.