రైతు భరోసాపై ప్రభుత్వం బిగ్ అప్డేట్
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంత వరకూ నాలుగు విడతల్లో 3 ఎకరాలు వరకు ఉన్న రైతులకు వర్తింపజేసింది.
మరో వారంలో నాలుగు ఎకరాలున్న రైతులకు అందించేందుకు చర్యలు చేపట్టింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 వేలు చొప్పన రైతుల ఖాతాలో జమ చేస్తారు. సాగు యోగ్యం కాని భూములను బ్లాక్లిస్టులో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.