తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు కూడా అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీ లేదా 27వ తేదీలలో ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 05వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు.