మహిళలకు త్వరలో నెలకు రూ.2500
తెలంగాణలో త్వరలో మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో వెల్లడించారు.
ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.