భారత్ - పాక్ సరిహద్దుల్లో టెన్షన్
భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లోని పీర్పంజల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఈ పరిస్థితి నెలకొంది. పాక్ కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడుతుండటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
సరిహద్దు అవతలి నుంచి కాల్పులు జరుపుతూ భారత బలగాల్ని రెచ్చగొట్టేందుకు పాక్ యత్నిసున్నట్లు సమాచారం. మరోవైపు సీజ్ఫైర్ ఉల్లంఘన జరగలేదని, అధికారికంగా అమల్లోనే ఉందని భారత్ చెబుతుండటం ఆసక్తికరంగా మారింది.