తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రదాడికి ప్లాన్.. హై అలెర్ట్ జారీ
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి వెనకాల పాకిస్తాన్ ప్రోత్భలం ఉందని భారత్ బలంగా నమ్ముతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పహల్గామ్ ఉగ్రవాద చర్యకు దీటుగా స్పందిస్తోంది. ఉగ్రవాదులను ఏరివేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ ధ్వంసం చేసింది. దాడికి పాల్పడిన వారిని ఎలాగైనా పట్టుకుని తీరుతామని భారత ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో ఇండియా పాక్ బోర్డర్‌లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే తరుణంలో కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని పలు ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించి 14 ప్రదేశాలను హై అలర్ట్ జోన్‌లుగా ప్రకటించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ప్రత్యేక ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్) బృందాలు ఈ ప్రాంతాల్లో మోహరించాలని నిర్ణయం తీసుకున్నారు.
అత్యవసరమైతే తప్ప ఈ ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని అధికారులు సూచించారు. ఒకవేళ అనివార్యంగా వెళ్లాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాదస్పద వస్తువులు, లేదా మనుషులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ జాబితాలో ఏయే ప్రాంతాలు ఉన్నాయంటే.
హైదరాబాద్:
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
కూకట్‌పల్లి
నాంపల్లి
మహాత్మా గాంధీ బస్ స్టేషన్
ట్యాంక్ బండ్
విజయవాడ:
రైల్వే స్టేషన్
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్
ఎం.జి. రోడ్ ప్రాంతాల్లో సంచరించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
విశాఖపట్నం:
రైల్వే స్టేషన్
రామకృష్ణ బీచ్
జగదాంబ జంక్షన్
తిరుపతి: తిరుమల, అలిపిరిలో ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పర్యాటకులకు టార్గెట్ చేసుకొని దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.