ఎమ్మెల్సీ ఎన్నికలు: తేలిన తొలి ఫలితం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు.
మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ దాదాపు 11 గంటల పాటు సాగింది.