ఏపీ: ఆ ఇంటి పట్టాలు రద్దు.. ప్రభుత్వం నిర్ణయం

News Published On : Sunday, February 9, 2025 07:36 AM

ఏపీలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఇంటి పట్టాలు పొందిన అనర్హులను గుర్తించి రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులకు కారు ఉందా? కుటుంబంలో ఎక్కువ మంది పట్టాలు పొందారా? తదితర వివరాలు సేకరించాలని తెలిపింది.

కాగా జగన్ ప్రభుత్వంలో 22.80 లక్షల మందికి ఇంటిస్థలాలు ఇచ్చారు. వీరిలో 15.71 లక్షల మందికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. మిగిలిన 7 లక్షల మందిలోనే అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది.