తిరుమల: భక్తుల రద్దీ ఎలా ఉందంటే..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
నిన్న శ్రీవారిని 69,746 మంది దర్శించుకున్నారు. 23,649 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పుష్కరిణిలో సాలకట్ల తెప్పోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.