చనిపోయిన తండ్రిని రెండు ముక్కలు చేసి అంత్యక్రియలు!!
మరణించిన తండ్రిని రెండు ముక్కలు చేయాలనుకుని కొడుకులు నిర్ణయించిన ఘటన మధ్య ప్రదేశ్ లోని టీకమ్ గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రి మరణించిన నేపథ్యంలో అంత్యక్రియలు చేసేందుకు ఇద్దరు కొడుకులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని గంటల తరబడి ఇంటి బయటే వదిలేశారు.
చివరికి శవాన్ని 2 ముక్కలు చేసి చెరో ముక్కకు ఇద్దరు అంత్యక్రియలు చేయాలని తుది నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం విని హడలిపోయిన స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడి పెద్ద కొడుక్కి కర్మకాండ బాధ్యతల్ని అప్పగించారు.