తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్
వేసవి ఎండలు ముదరకముందే ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధం ప్రారంభమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఏపీ ఇప్పటికే వాటాను మించి నీటిని వాడుకుందని తెలంగాణ సర్కారు కృష్ణా నీటి యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.
ఇకపై నీటిని తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. తెలంగాణలో ప్రతిపక్ష బిఆర్ఎస్ సైతం ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.