మెట్రోలో ఈ వస్తువులు నిషేధం..
మెట్రో స్టేషన్లలో తనిఖీల సమయంలో పలు వస్తువుల విషయంలో సిబ్బందికి ప్రయాణికులకు మధ్య తరచుగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికుల కోసం ఎంట్రన్స్ వద్దే నిషేధిత వస్తువుల జాబితాను మెట్రో ఏర్పాటు చేసింది. మండే స్వభావం ఉన్న వస్తువులు, తుపాకులు, గొడ్డలి, గడ్డపార, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలు, మాంసం, పాడైన కూరగాయలు, సీల్ వేయని మొక్కలను అనుమతించరు.
సీల్ వేసిన రెండు మద్యం సీసాలను అనుమతిస్తారు. ఈ విషయాన్ని మెట్రో ప్రయాణీకులు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. నిషేధిత వస్తువులతో ప్రయాణం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.