మద్యం తాగేవారిని పట్టిస్తే రూ.10 వేలు
మద్యం తాగిన వారిని పట్టిస్తే రూ.10 వేలు దక్కనున్నాయి. ఈ మేరకు తెలంగాణలోని నల్గొండ జిల్లా ఏపూరులో గ్రామం మహిళా సంఘం నేతలు కీలక ప్రకటన చేశారు. మద్యం తాగి గ్రామంలో తిరిగేవారిని గుర్తిస్తే రూ.10 వేలు నజరానా ఇస్తామని వెల్లడించారు.
ఇటీవల ఓ యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తమను కలిచివేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రేతలకు రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేల జరిమానా విధించేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.