తిరుమల: నేడు 10 గంటలకు టికెట్లు విడుదల

News Published On : Monday, February 24, 2025 08:39 AM

తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఈ రోజు (సోమవారం) ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది. ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.