ఏపీ: నిలిచిన రైళ్ల రాకపోకలు
రైల్వే వంతెన కుంగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో నెలకొంది. అర్ధరాత్రి టిప్పర్ వాహనం వంతెన నుంచి వెళ్తుండగా గడ్డర్ ను ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ దెబ్బతింది.
విశాఖపట్నం-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కు అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.