ట్రంప్ కు వర్జీనియా కోర్టులో ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్ బాదర్ ఖాన్ను అమెరికా నుంచి బహిష్కరించొద్దని వర్జీనియా కోర్టు ఆదేశించింది. బాదర్ ఖాన్కు హమాస్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ట్రంప్ ప్రభుత్వం అతడిని గత సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో అరెస్టును సవాల్ చేస్తూ బాదర్ ఖాన్ కోర్టును ఆశ్రయించగా అతడికి కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.