ఆ దేశానికి వెళ్ళకండి.. ట్రంప్ హెచ్చరిక
అమెరికా పౌరులకు ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్ కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని సూచించింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు.