ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్ కు ప్రయోజనం..?
గత కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలపై సుంకాలు ఎడాపెడా పెంచేస్తూ హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరస్పర సుంకాల నుంచి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ లకు మినహాయిపునిచ్చారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ఆపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.