విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బీసీ విద్యార్థులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. బీసీ విద్యార్థుల రూ.110.52 కోట్ల డైట్ బకాయిలు, రూ.29 కోట్ల కాస్మోటిక్ బిల్లులు వెంటనే చెల్లించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటెమ్స్ ఇవ్వాలని సూచించారు. అలాగే, నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.