వెంకటేష్, రానాపై కేసు నమోదు చేసిన పోలీసులు

News Published On : Sunday, January 12, 2025 02:33 PM

దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. సిటీ సివిల్ కోర్టులో నందకుమార్ కేసు నమోదు చేయడంతో హీరో వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబుపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.