భక్తులకు TTD గుడ్ న్యూస్
వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు దర్శన ఎనోల్మెంట్ స్లిప్పైనే ఇకపై తిరుమలలో వసతి గదులు కేటాయించనున్నారు. సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వసతి గదుల కోసం దర్శన ఎన్రోల్మెంట్ స్లిప్ తీసుకుని గదుల కేటాయించే సెంటర్ల వద్దకు వెళ్లాలి. అక్కడి సిబ్బంది స్కానింగ్ చేసిన అనంతరం నేరుగా గదులు కేటాయిస్తారు.