గోశాలలో 100 ఆవులు మృతి.. స్పందించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు మృతి చెందాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీ దానిపై ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశంపై టీటీడీ స్పందించింది. గోశాలలో 100 ఆవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. మృతి చెందిన అవుల ఫోటోలు టీటీడీ గోశాలలోనివి కాదని తెలిపింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది.