రుషికొండకు బ్లూ ఫ్లాగ్ రద్దు.. ఇద్దరు అధికారులపై వేటు
విశాఖ రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ హోదా గుర్తింపు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు బాధ్యుల్ని చేస్తూ బాధ్యులను చేస్తూ ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, RJD రమణను తప్పించింది.
బీచ్ పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.