Budget: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..

News Published On : Saturday, February 1, 2025 02:37 PM

ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం కేంద్ర బడ్జెట్‌లో శుభవార్త అందించారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చేవారం కొత్త ఆదాయపు పన్ను చట్టం చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆదాపు పన్ను ప్రకటన మధ్యతరగతి వారికి ఊరట కలిగేలా ట్యాక్స్ విధానమని పలువురు భావిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం తీసుకురానున్నారు. టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపు ఉండనుంది. అద్దె ఆదాయంపై టీడీఎస్ రూ.6 లక్షలకు పెంపు ఉంటుందని చెప్పుకొచ్చారు.

దేశవ్యాప్తంగా 50 టూరిస్ట్ ప్లేస్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చెయ్యబోతోంది. ఇందుకు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేయబోతోంది. ఆయా టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. భారీ ఎత్తున హోటళ్లను ఏర్పాటు చేయిస్తామన్నారు. టూరిజం అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచాతామనీ, స్కిల్ కూడా డెవలప్ చేస్తామని తెలిపారు. మహిళలకు సులభంగా రుణాలు అందుబాటులో ఉండేలా.. కొత్త స్కీమ్ తీసుకువస్తామని ప్రకటించారు.