విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం ఆమోదం: సాధించిన చంద్రబాబు - పవన్ కళ్యాణ్

News Published On : Saturday, February 8, 2025 08:38 AM

ఏపీకి మోడీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌కు శుక్రవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వాల్తేర్ డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్‌ ను ఏర్పాటు చేసింది. పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. పాత వాల్తేర్‌ డివిజన్‌ను కేంద్రం రెండుగా విభజించింది. 410 కి.మీ మేర విశాఖపట్నం డివిజన్‌గా మార్పు చేసింది. మిగతా 680 కి.మీ.రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేసింది. రాయగడను ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేలో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.