పూజారే పెళ్లి కొడుకు అయ్యాడు.. కారణం ఇదే..

News Published On : Sunday, January 26, 2025 08:51 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో పెళ్లికుమారుడే పురోహితుడిగా మారారు. మరో పూజారి పర్యవేక్షణలో తానే స్వయంగా వేదమంత్రాలు చదువుతూ తన వివాహ తంతును పూర్తి చేసుకున్నాడు.

సహారన్‌పుర్‌ జిల్లాకు చెందిన వివేక్‌కుమార్‌కు హరిద్వార్‌ జిల్లావాసి అనిల్‌కుమార్‌ కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. వివేక్‌కుమార్‌ ఊరేగింపుతో పెళ్లిమండపానికి వచ్చారు. వేదికపై వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకున్నారు. ఆ తర్వాత హోమం మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంది. ఆ సమయంలో వరుడు తన వివాహ ఆచారాలను తానే నిర్వహిస్తానని పూజారికి చెప్పారు. వరుడు మంత్రాలు చదవడం ప్రారంభించగానే వివాహానికి వచ్చిన వారంతా చప్పట్లతో ఉత్సాహ పరిచారు. ఈ వివాహం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరల్ గా మారింది.