Breaking: బాలీవుడ్ నటుడు కన్నుమూత
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వయోభారంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రోటీ, కపడా ఔర్ మకాన్' మరియు 'క్రాంతి వంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవకు గాను 1992లో పద్మ శ్రీ అవార్డుతో పాటు, 2016 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.