వివేకా హత్య కేసులో త్వరలోనే నిజాలు బయటకు : దస్తగిరి
వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3 గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్నారు.
ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాన్నారు. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిదని పేర్కొన్నారు.