నేడు పార్లమెంటులో వక్ఫ్ ఆస్తుల సవరణ బిల్లు

News Published On : Monday, February 3, 2025 09:15 AM

నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు రానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వర్ఫ్ సవరణ బిల్లు-2024'పై జేపీసీ నివేదిక ఇవాళ లోక్ సభలో పెట్టనున్నారు. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ 14 సవరణలతో కూడిన నివేదికను పార్లమెంటులో సమర్పించనున్నారు.

ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఆ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. వక్స్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేమని బీజేపీ సర్కార్ చెబుతోంది. అయితే ఈ సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.