మూడు రోజులు వైన్ షాపులు బంద్
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి.
తెలంగాణలో మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. అటు ఏపీలోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.