నేడు వైన్ షాపులు బంద్
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని నేడు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు మినహాయింపునిచ్చారు. అటు జిల్లాల్లో వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి.