వీడు మామూలోడు కాదు.. ఒకే సారి 17 మందితో..
ఓ యువకుడు ఒకేసారి 17 మందితో ప్రేమాయణం నడిపాడు. ఆ యువకుడికి యాక్సిడెంట్ కావడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన షాకింగ్ ఘటన చైనాలో జరిగింది. చైనాకు చెందిన 28 ఏండ్ల యువాన్ కు ఇటీవల యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో చేరాడు. ఈ విషయం యువాన్ గర్ల్ ఫ్రెండ్స్ కు తెలిసింది. అతడు ఎలా ఉన్నాడో తెలుసుకునేందుకు ఒక్కొక్కరుగా హాస్పిటల్ కు వచ్చారు. చివరకు 17 మంది అయ్యారు. అందరూ అక్కడికి రావడంతో ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. యువాన్ వీళ్లందరితో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపించాడని తెలియడంతో షాకయ్యారు.
వారందరినీ చూసి యువాన్ ప్రాణం పోయినంత పని అయ్యింది. ఇంతకాలం తనకే సొంత అనుకున్న వ్యక్తి ఇంతా మోసం చేస్తాడని అస్సలూ ఊహించలేకపోయారు. కోపంతో ఊగిపోయారు .ప్రస్తుతం యువాన్ వ్యవహారం చైనాలో హాట్ టాపిక్ గా మారింది. యువతులు అంతా ఇకపై అతడికి దూరంగా ఉండటంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువాన్ లాంటి వారి వల్ల అసలు ప్రేమ అనే మాటకే విలువలేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువాన్ కోలుకున్న తర్వాత అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. రీసెంట్ గా చైనాలో ఇలాంటి ఘటనే జరిగింది. భార్యతో పాటు ఏకంగా నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ను మెయింటెయిన్ చేశాడు. వీరందరినీ ఒకే అపార్ట్ మెంట్ లో ఉంచి, ఒకరికి తెలియకుండా మరొకరితో గడిపేవారు. ఈ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ లో ఇద్దరు మహిళలు, అదే మహిళలకు చెందిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. చివరకు అసలు విషయం బయపడటంతో జైల్లో చిప్పకూడు తింటున్నాడు.