బతికుండగానే RIP పోస్ట్ పెట్టుకున్న యువకుడు
ఓ యువకుడు బతికుండగానే RIP పోస్ట్ పెట్టుకున్నాడు. ఉద్యోగ వేటలో ఎన్నో అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రశాంత్ హరిదాస్ మూడేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో చనిపోయినట్లు సంస్మరణ ఫొటోను లింక్డిన్ లో పోస్ట్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను వివరించాడు. చాలా మంది ఉద్యోగ అవకాశాల గురించి కామెంట్స్ చేస్తూ అతనికి మద్దతుగా నిలిచారు.