వంశీకి జగన్ పరామర్శ
విజయవాడలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ములాఖత్‌లో వంశీని జగన్ కలిశారు.
అయితే కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి నానికి అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాలతో అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.