వైఎస్ అభిషేక్ రెడ్డి అకాల మరణం.. వైఎస్ కుటుంబంలో విషాదం

News Published On : Tuesday, January 7, 2025 11:24 PM

వైఎస్ఆర్సిపి వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శి వైయస్ అభిషేక్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం. కడప జిల్లా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఏఐజీ (AIG) హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణుల్లో తీవ్ర అనిశ్ఛితి నెలకొంది. లింగాల మండల ఇన్చార్జి గా వైకాపా తరపున 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పనిచేశారు. వైఎస్ కుటుంబంలో అభిషేక్ రెడ్డి అకాల మరణంతో విషాదం అలుముకుంది.